వస్తువులకంటే జీవితం గొప్పది కాదా ?
"అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; ఆహారముకంటే ప్రాణమును, వస్త్రముకంటె దేహమును గొప్పవికావా !" మత్తయి 6:25
జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికే ఉద్దేశించబడింది. యోహాను 10:10 లో యేసు అంటాడు " దొంగ దొంగతనమును హత్యను, నాశనమును చేయుటకు వచ్చునుగాని మరి దేనికిని రాడు; గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని". సాతాను అనేక విధాలుగా ఆ జీవితాన్ని దోచుకోడానికి ప్రయత్నిస్తాడు. వాటిల్లో ఒక ప్రయత్నం విచారం కలిగించడం.
మనం జీవితంలో దేన్నీ గురించి చింతించనవసరంలేదని మత్తయి 6:25 వివరిస్తోంది. దేవుడు మనకు అనుగ్రహించిన జీవిత లక్షణంలో మిగిలినవన్నీ కలసివున్నాయి. అయితే మనం యితరమైన వాటికొరకు చింతిస్తే వాటినేగాక దేవుడు మనకొరకు ఉద్దేశించిన జీవితాన్నే కోల్పోతాం.

No comments:
Post a Comment