అపనమ్మకం
"నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను".
"మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సు గలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని," అవి శ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక,
"దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను". రోమా 4:18-21
తన శరీరం నుండి తనకొక వారసుణ్ణి అనుగ్రహిస్తానని దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేసాడు. ఆ వాగ్దానం చేసిన తర్వాత అనేక సంవత్సరాలు గరించిపోయినవి అయినా అబ్రాహాము, శారాలకు సంతానం కలుగలేదు. దేవుడు చెప్పినది నెరవేరుతుందన్న నమ్మకంతో వున్నాడు అబ్రాహాము. అలా స్థిరమైన నమ్మకంతో వున్నా అనుమానాలనే ఆలోచనలతో అతడిపై దాడి జరిగింది, అపనమ్మకమనే ఆత్మదేవునికి అవిధేయుడవు కమ్మని అతనిపై వత్తిడి తెస్తోంది.
ఇలాంటి పరిస్థితులలో దేవుడు దానిపై వత్తిడి తెండి అని చెబుతున్నప్పుడు అవిధేయతను విడిచిపెట్టడమే. అవిధేయత దేవుని స్వరాన్ని గుర్తించదు, లేక దేవుడు మనతో వ్యక్తిగతంగా పది ఆజ్ఞలను హద్దుమీరకు అని చెబుతున్నదాన్ని అవ్విధేయత వినిపించుకోదు.
అబ్రాహాము పట్టుదలతోనే వున్నాడు. అతడు దేవుని స్తుతిస్తూ ఆయన్నే మహిమపరుస్తున్నాడు. అతడలా చేసేకొద్దీ విశ్వసంతో బలపడ్డాడు అని బైబిలు వివరిస్తోంది.
దేవుడు మనకు ఒక విషయాన్ని చెప్పినప్పుడు, లేక ఒక పనిని చేయమని చెప్పినప్పుడు దాన్ని నమ్మడానికి, లేక దాన్ని చేయడానికి దేవుని వాక్యమునుండే వస్తుంది విశ్వసం. ఒక పనిని చేయమని చెప్పి, దాన్ని చేయాలన్న నమ్మకం సమర్థతా మనలో కలిగించకుండా పనిచేయమనడం ఆయనకే హాస్యాస్పదం అవుతుంది. మనలో హృదయ విశ్వసంతో నిండి వుండే అది అతనికెంత ప్రమాదమో సాతానుకు తెలుసు గనుక అనుమానం, ఆపన్నమకం అనే ఆయుధాలతో మనపై దాడి చేస్తాడు.

No comments:
Post a Comment