మీకంత వ్యాకులత ఎందుకు?
"వస్త్రములను గూర్చి మీరు చింతింప నేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు.
"అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు.
"నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా". మత్తయి 6:28-30
తన సృష్టిలో ఒకదాన్ని ఉదాహరణగా తీసుకొని ఏమిచేయని పువ్వును గూర్చి దేవుడంత శ్రద్ధ తీసుకొని సొలొమోను వైభవంగా కంటే దాన్ని ప్రకాశింపచేస్తున్నప్పుడు మన విషయంలో ఆయన శ్రద్ధ తీసుకొంటాడని, మనకవసరమైనవన్నీ అనుగ్రహిస్తాడని మనం తప్పక నమ్మాలి.

No comments:
Post a Comment