కాగా, చింతించకుడి, వ్యసనపడకుడి!
"కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు". మత్తయి 6:31
దీన్ని కొంచెం విస్తరించి, మరోప్రశ్న కూడా దీనికి జతచేయాలను కుంటున్నాను, "మనమేం చేయబోతున్నాం?"
సాతాను పంపించే తన సేవకులు ఒక విశ్వాసి చెవిలో చెప్పిందే చెప్పడం తప్ప మరో పని ఉండదు. అవి కష్టమైనా ప్రశ్నలు మీ మీద ప్రయోగిస్తాయి. ఇక ఆ విశ్వాసి వాటి జవాబు కొరకు తన విలువైన సమయాన్నింతా వ్యర్థం చేస్తూ ఉంటాడు. క్రైస్తవుని బయటికి లాగాలని, సాతాను ఎడతెగక అతని మనస్సనే యుద్ధరంగంలో పోరాడుతూనే ఉంటాడు.
31వ వచనంలో చుడండి, మీరు చింతించకండి, వ్యసనపడకండి అని ప్రభువు హెచ్చరిస్తున్నాడు. హృదయంలో నిండివున్నదాన్నే నోరు పలుకుతుంటుంది అన్న మాట జ్ఞాపకం చేసుకోండి (మత్తయి 12:34). మన మనస్సునిండా తప్పుడు విషయాలను నింపితే అవి మన నోటి నుండి వస్తాయని సాతానుకు తెలుసు. మన విశ్వాసాన్ని స్థిరపరచేవి మన మాటలే గనుక అవి చాలా ప్రాముఖ్యమైనవి. కొన్ని సందర్భాల్లో మన అవిశ్వాసమే.

No comments:
Post a Comment