బహుమానాలనుగాక, దేవుని వెదకాలి
"ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.
"కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును". మత్తయి 6 : 32,33.
దేవుని బిడ్డలు లోకస్తుల్లా ఉండకూడదని తేటతెల్లమయింది! లోకస్తులు వస్తువులను వెదకుతారు. మనమైతే దేవుని వెదకాలి. మనంగాని ఆ పనిచేస్తే మన అవసరాలేవో ఆయనకు
తెలుసు గనుక అవన్నిటినీ యిస్తానని ఆయన వాగ్దానం చేశాడు.
దేవుని చేతినిగాక ఆయన ముఖాన్ని వెదకడం నేర్చుకోవాలి!
తన బిడ్డలకు మంచి వాటిని యివ్వడంలో మన పరలోకతండ్రి ఆనందిస్తాడు, అయితే మనం వాటి కొరకు ప్రాకులాడకుండా వున్నప్పుడే.
మనం అడుగకముందే మన అవసరం ఏమిటో దేవునికి తెలుసు. మన విన్నపాలను ఆయనకు తెలియజేసుకుంటే (ఫిలిప్పీ 4:6) ఆయన తన తగిన సమయంలో వాటిని అనుగ్రహిస్తాడు. చింత మనకెప్పుడూ, ఎలాటి సహాయాన్ని చెయలేదు. వాస్తవానికి అది మన ప్రగతిని ఆటంక పరుస్తుంది.

No comments:
Post a Comment