నీళ్ళమీద నడుస్తూ ఉండుట!
"అప్పటికాదోనె దరికి దూరముగనుండగా గాలి యెదురైనందున అలలవలన కొట్ట బడుచుండెను".
"రాత్రి నాలుగవ జామున ఆయన సము ద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను
ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి".
"వెంటనే యేసుధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడనివారితో చెప్పగా"
"పేతురు - ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను".
"ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని"
"గాలిని చూచి భయపడి మునిగిపోసాగి".
"ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను. వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొనిఅల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను".
"వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను". మత్తయి 14: 24-32.
సాతాను ఈ భాగంలో చేసినదాన్ని వివరించడానికి నేను చివరి వచనాన్ని గమనించమని నొక్కి చెబుతున్నాను. అంతకుముందు తానెన్నడూ చేయనిదాన్ని యేసు ఆజ్ఞతో చేయడానికి అడుగు బయటపెట్టాడు. వాస్తవానికి యేసు తప్ప ఆ పనిని ఎవరూ చేయలేరు. దానికి విశ్వాసం అవసరం!
పేతురోక తప్పు చేసాడు, తుఫానును చూస్తూ ఎక్కవ సమయాన్ని గడిపాడు. దాంతో అతడు భయపడ్డాడు. అనుమానం, అపనమ్మకం అతనిపై ఒత్తిడి తెచ్చాయి. వెంటనే అతడు మునిగిపోవడం మొదలుపెట్టాడు. తన్ను రక్షించమని యేసుకు మొర్రపెట్టాడు. ఆయన అతణ్ణి రక్షించాడు. అయితే పేతురు దోనెలోకి మళ్ళీ రాగానే తుఫాను ఆగిపోయింది.
మీ జీవితాల్లో తుఫాను వచ్చినప్పుడు మీ రెండు మడిమలు తొక్కిపెట్టి మీ ముఖాన్ని చెకుముకి రాయిగా చేసి పరిశుద్ధాత్మలో నిశ్చయపరచుకొని దోనె బయట వుండండి! మీరెప్పుడైతే సురక్షిత ప్రాంతానికి చేరుకొంటారో అప్పుడా తుఫాను ఆగిపోతుంది.
మిమ్ములను పిరికివారిగా చేయడానికి మీ జీవితాల్లో తుఫానులను రేపుతాడు సాతాను. తుఫాను సమయంలో గుర్తు చేసుకోండి. మనసు యుద్ధరంగమని మీ ఆలోచనల, భావాల ఆధారంగా మీ నిర్ణయాలు చేయకండి, కానీ మీ ఆత్మతో సరిచూడండి. అలా మీరు చేసినప్పుడు ప్రారంభంలో ఏ దర్శనం వుందో ఇప్పుడూ అదే అక్కడ ఉంటుంది.

No comments:
Post a Comment