Friday, May 8, 2020

Meditate on the Word

వాక్యమును ధ్యానించు 



      "దుష్టుల ఆలోచనచొప్పున నడువకపాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచుదివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు". కీర్తనలు 1:1-2

     నా ప్రియ దేవుని బిడ్డలారా వాక్యమును ధ్యానించటం అంటే "శ్రద్ధ చూపు" "ఆచరణలో పెట్టు" "దేవునికి దగ్గరగా" వుండు అని అర్ధం.  సామెతలు 4:20 ఇలా చెప్పుచున్నది "నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము". ఈ వాక్యములోని అన్ని పాదములను కలిసికట్టుగా నిర్వచిస్తే "ధ్యానము" అను మాట దేవుని వాక్యాన్ని శ్రద్దతోను, ఏకాగ్రతతోను, నెమరువేసుకొనుచు లేక మన ఆలోచనలో ఆచరణలో కలిగియుండుట అని తేలియజేస్తుంది. దీనికర్థమేమిటంటే దేవుని వాక్యము ఏమి చెప్పుచున్నదో దాని ప్రకారంగా మనం చేయదలచినచో దానిని గూర్చి ఆలోచించుటలో మనం సమయాన్ని గడపాలి. 

   పాత సామెత "సాధన సంపూర్ణానిస్తుంది" అను దానిని జ్ఞాపకముంచుకొ. సాధన లేకుండా మన జీవితంలో మనం దేనియందైనను ప్రావీణ్యత సంపాదించలేము గనుక క్రైస్తవత్వమును ఒక ప్రత్యేకమైనదానిగా మనమెట్లు చేయగలం ?  

No comments:

Post a Comment