Friday, May 8, 2020

Meditation is the Key to Success

ధ్యానము సఫలతనిస్తుంది 


      "ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపో కూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు". యెహోషువ 1:8

  ప్రియ దేవుని బిడ్డలారా మనము మన వ్యవహారములన్నిట్లో వృద్దిచెంది సఫలత సాధించాలనంటే మనము దేవుని వాక్యమును దివారాత్రులు ధ్యానించవలెనని బైబిలు చెప్పుచున్నది. 

     దైవవాక్యమునుగూర్చి ఆలోచిస్తూ మనము ఎంత సమయాన్ని గడుపుతాము ? మనము మన జీవితంలో ఏ విషయంలోనైనను సమస్యలు కలిగియున్నయెడల ఈ ప్రశ్నకు మన వినయముగల జవాబు తగిన కారణాన్ని బయలుపర్చవచ్చు. 

   నా జీవితంలో అధిక భాగం నేను దేనిని గూర్చి ఆలోచించుచున్నానో దానిని గూర్చి ఆలోచించనేలేదు. నా మెదడులో నేను ఏమేమి అనుకునేదాన్నో దానినే ఆలోచించేదాన్ని. సాతాను నాలో తన ఆలోచనలను చొప్పింపజేస్తుందని నాకు బయలుపర్చబడలేదు. నా మెదడులో ఉన్న విషయాలలో ఎక్కవ భాగం సాతాను నాతో చెప్పేవి లేక నా మనసుకు తోచిన పిచ్చి ఆలోచనలు మాత్రమే. నేను నిజంగా సమయం వెచ్చించి చేసిన ఆలోచనలనేవిలేవు. సాతానుడు నా ఆలోచనలను అదుపు చేసేవాడు గనుక వాడే నా జీవితాన్ని అదుపులో ఉంచేవాడు. 

No comments:

Post a Comment