Saturday, May 9, 2020

Meditate on the Works of God

దేవుని క్రియలు ధ్యానించు 


"దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితివిు". కీర్తనలు 48:9

    యెహోవా మహత్కార్యములన్నిటి మీద తరుచుగా కీర్తనకారుడైన దావీదు ధ్యానిస్తుండేవాడు. అవి దేవుని ఆశ్చర్యకార్యములని అతడు గుర్తించాడు. అతడు యెహోవా నామము, దేవుని కృపను మరియు అనేకమైన ఇతర విషయాలను తలచేవాడని అతడు చెప్పుకున్నాడు. 

    అతడు నిస్పృహ చెందినప్పుడు కీర్తన 143:4-5 లో ఇలా వ్రాశాడు. "కావున నా ఆత్మ నాలో క్రుంగియున్నది నాలో నా హృదయము విస్మయమొందెను. పూర్వదినములు జ్ఞాపకము చేసికొనుచున్నాను నీ క్రియలన్నియు ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను". 

   ఈ పాఠ్యభాగమునుండి దావీదు తన నిరాశలో వేదనలో కూడా సమస్యమీద ధ్యానించాలని చెప్పడంలేదని చూస్తాం. దానికిబదులు గతంలోని మంచి విషయాలను జ్ఞప్తికి తెచ్చుకొనుటకు ఎంచుకొని సమస్యకు ఎదురు పోరాడియున్నాడు. అతడు దేవుని కార్యాలను అయన చేతి పనులను ధ్యానించేవాడు. వేరొకవిధంగా చెప్పాలంటే మంచి విషయాలనే అతడు ఎంచెడివాడు దానివలన అతడు సిస్పృహను జయించేవాడు. 

   నీ విజయానికి నీ మనసు ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుందని నువ్వు ఎన్నడూ మర్చిపోకు. 

  ఇది మన జీవితాలలో విజయాన్ని తీసుకొచ్చుటకై దేవుడు వాక్యముద్వారా పనిచేశాడు. పరిశుద్దాత్మ శక్తియైయున్నదని నాకు తెలుసు. అయితే మనకొరకు చేయబడవలసిన పెద్ద మొత్తం పని అంతా దేవునితోను ఆయన వాక్యముతోను మనకు గల ఆలోచనయైయున్నది. మనము దీనిని చేయుటకు తృణీకరిస్తే లేదా ఇది ముఖ్యమైనది కాదని ఎంచితే మనమెన్నడు విజయాన్ని అనుభవించలేము.  

No comments:

Post a Comment