Tuesday, June 23, 2020

The Soft Words Heal the Sweet

మృదువైన మాటలు తియ్యనివి స్వస్థపరచునవి

  "జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్య కరమైనవి". సామెతలు 16:23,24

       మాటలు తలంపులు ఎముకలు మూలుగుల వంటివి ఇవి అతి చేరువై విడదీయలేనివి. హెబ్రీ 4:12

      మన ఆలోచనలు మనకు మన ప్రభువు వినిపించే మెల్లని మాటలు కాని అవే మన అంతరంగ పురుషుని, మన ఆరోగ్యాన్ని మన ఆనందాన్ని మన భావాలను ప్రభావితం చేసేడేవి. మనము తలంచేది మన నోటిద్వారా బయటికి వస్తుంది. ఇచ్చట విచారంగా తలంచవలసినదేమనగా కొన్నిసార్లు అవే మనలను అజ్ఞానులుగా చేయును. తీర్పు తీర్చుట విమర్శించుట అనుమానము కలిగియుండుట ఎన్నడును ఆనందాన్ని ప్రసాదించవు. 

    యేసు వచ్చింది మనకు ఆనందమయ జీవితమును ఇవ్వటానికేనని సెలవిస్తారు (యోహాను 10:10) క్రీస్తు యేసుకు కలిగిన మనస్సుతో నీ మనసు కలిపి జీవించు అప్పుడు జీవసంబంధమైన పరిపక్వతలోనికి నీవు ప్రవేశించుదువు. 

No comments:

Post a Comment