Thursday, May 7, 2020

Take care of what you think

నీవు ఆలోచించు దానిని గూర్చి జాగ్రత్తపడుము 


     "మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును, మరి ఎక్కువగా మీ కియ్యబడును". మార్కు 4:24. 

     నా ప్రియ స్నేహితులారా ఇది ఎంతగొప్ప లేఖనము ! చదువుటలోను, వినుటలోను మనమెంత ఎక్కవ సమయాన్ని వాక్యమునుగూర్చి ఆలోచించెదమో అంతకుమించిన శక్తి సామర్ధ్యములను మనము కలిగియుండాలి - మనము చదివిన, విన్న దానినిగూర్చి మనకు మరింత జ్ఞానము బయలుపర్చబడుతుంది. మనము ఏమైతే పెట్టుదుమో దానినే తిరిగి వాక్యమునుండి పొందెదమని ఇది మనకు తెలియజేస్తుంది.  

      వాక్యము యెడల ధ్యానము కలిగియుండుటలో ఎంతగా మన ఆలోచనలను దానికొరకు వెచ్చించామో అంతగా తిరిగి జ్ఞానము రూపములోను, శ్రేయస్సురూపములోను మనలను దర్శిస్తుందనే వాగ్దానమును గమనించవలెను. 

     చాలామంది దేవుని వాక్యమును లోతుగా గ్రహించరు. దానిఫలితంగా విజయవంతమైన జీవితములను జీవించు శక్తిగల క్రైస్తవులుగా తామెందుకు ఉండడంలేదు అని గ్రహించుటలో తికమకపడుచున్నారు. 

      శరీరము సాధారణముగా బద్దకమైనది, (వారి ద్వారా ఏ ప్రయత్నము లేకయే) అనేకులు ఏమిలేనిదానికి ఏదో ఒకటి పొందాలని కోరుకుంటారు; మొత్తానికి పనిచేసే తీరు అదికారు. ఒక వ్యక్తి తనకిష్టమైన దానిని వాక్యమునకు చేర్చుటద్వారా అతడు దానికి దూరమౌతాడు, అని నేను మళ్ళీ అంటున్నాను.  

No comments:

Post a Comment