దేన్నీ గూర్చి ఆలోచిస్తున్నావో ఆలోచించుకో
"నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను." కీర్తనలు 119:15.
ఆలోచనలో మన సమయాన్ని ఎట్లు గడుపవలెనో దేవుని వాక్యము బోధించుచున్నది.
దేవుని వాక్యములోని విషయాలను గూర్చి ఆలోచించేడివాడనని లేక ధ్యానించేడివాడనని కీర్తనకారుడు తెలియజేయుచున్నాడు. దేవుని త్రోవలను గూర్చి తలపోయుటకును, ధ్యానించుటకును, అతడు అధిక సమయమును వెచ్చించేవాడు. కీర్తన 1:3 లో దీనిని చేయువాడు ఎట్లుండునో తెలియజేయుచున్నది: అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును.
దేవుని వాక్యమును గూర్చి ధ్యానించడం చాలా ఉపయోగకరం. ఒకడు వాక్యమును ధ్యానించుటలో తన సమయాన్ని గడిపేకొద్ది వాక్యము నుండి మరిన్ని ఫలములను కోయును.

No comments:
Post a Comment