నమ్ముటకు నిశ్చయించుకో
"అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపనము చేయుచున్నాడు". రోమా 8:26.
క్రైస్తవులముగా విశ్వసించుటకు నిశ్చయించుకొనుట యెట్లో నేర్చుకొనవలసియున్నది. దేవుడు మనకు తరచుగా (ఆత్మయొక్క ఉత్పత్తియైన) విశ్వాసమును, మన మనసు ఎప్పుడూ కొన్ని విషయాలకు అంగీకారముగా ఉండనివాటి విషయమై, అనుగ్రహించును. మనస్సు ప్రతిదానిని గ్రహించుటకు కోరుకొనును - ఎందుకు, ఎప్పుడు, ఎలా అనే వాటికన్నిటికి. తరచు ఆ గ్రహింపు దేవుని నుండి పొందకపోయిన యెడల గ్రహించలేనివాటిని నమ్ముటకు మనస్సు అంగీకరించదు.
ఎప్పుడూ జరిగేదేమిటంటే విశ్వాసి తన హృదయంలో (తన అంతరంగంలో) ఏదోయొకటి తెలుసు కాని తన మనస్సు దానికి వ్యతిరేకముగా పోరాడుతుంది.
వాక్యము ఏమి చెప్పుచున్నదో దానిని విశ్వసించాలని చాలాకాలం క్రతం నిశ్చయించుకున్నాను. దేవుడు నాకిచ్చిన (ఆయన నాతో మాట్లాడిన లేక వ్యక్తిగతముగా ఆయన నాకిచ్చిన వాగ్ధానములను) వాటిని అనగా "రేమా" (బయలుపర్చబడిన వాక్యము)ను ఎందుకు, ఎప్పుడు, ఎలా అనేవి నా జీవితంలో ఎలా గడిచిపోతాయో నేను విశ్వసించాను.

No comments:
Post a Comment