Wednesday, May 6, 2020

Powers that Bind the Mind

మనసును బంధించే శక్తులు 


        "దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును." ఫిలిప్పి 4:6-7
        నేను దేవునితో నడిచేటప్పుడు కొన్ని నేను ముందుగా నమ్మిన విషయాలను మళ్ళీ నమ్మే దుర్భర పరిస్థితి ఒకసారి నాకు ఏర్పడింది. నా తప్పేమిటో నాకు అర్ధంకాక నేను తికమకపడ్డాను. ఈ అస్థవ్యస్థ పరిస్థితి గడిచేకొద్దీ నాకు తికమక ఇంకా ఎక్కవయిపోయింది. నాలో అవిశ్వాసం శరవేగంతో వృద్దిచెందింది. నా పిలుపును ప్రశ్నించడం మొదలుపెట్టాను; దేవుడు పరిచర్యకొరకు ఇచ్చిన దర్శనాన్ని జారవిడుచు కుంటున్నట్లు నేను భావించాను. నేను దయనీయస్థితిలో ఉండే దానిని (అవిశ్వాసము బాధకు గురి చేస్తుంది). 
        "మనసును బంధించే ఆత్మలు" అనే మాటలు నా ఆత్మలో రెండు రోజులుగా వినిపిస్తూ వుండేవి. మొదటి కోజున దీని గురించి అంతగా ఆలోచించలేదు. మొత్తానికి, రెండవరోజున విజ్ఞాపన సమయాన్ని నేను ప్రారంభించినప్పుడు మళ్ళీ అవేమాటలను నాల్గవమారు, ఐదవమారు విన్నాను: "మనసును బంధించే ఆత్మలు". 
         నేను పరిచర్య చేసిన ప్రజలందరినుండి తెలుసుకున్నాను, అసంఖ్యాకులైన విశ్వాసులు తమ మనస్సులతో సమస్యలు కిలిగియున్నారని. "మనసు బంధకం" అనే ఆత్మకు వ్యతిరేకముగా క్రీస్తు శరీరము కొరకు ప్రార్ధించుటకు పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తున్నాడని నేననుకున్నాను. కనుక మనసును బంధించు ఆత్మలకు వ్యతిరేకముగా యేసు నామమున ప్రార్ధన చేయడం ప్రారంభించాను. కేవలం రెండు నిమిషాల ప్రార్ధనానంతరం నా సొంత మనసుకు మహత్తరమైన విడుదల వచ్చినట్లు నాకనిపించింది. అది వర్ణింపడగ్గది. 

No comments:

Post a Comment