Tuesday, May 5, 2020

The Intensity of Expectation & Bad suggestions

నిరీక్షణ యొక్క తీవ్రత 



         "ని సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానినిబట్టి తాననేక జనములకు తండ్రియగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగినమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడైయుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారా గర్భము  మృతతుల్యమైనట్టును ఆలోచించేనుగాని, విశ్వసమువలన దేవుని వాగ్ధానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వసమువలన బలము నొందెను". 
---------------------------------------------------------------------------------------------------

చెడు సూచనలు 



         నేను దేవుని వాక్యమును చదవడం ప్రారంభించిన క్రొత్తలో నా చుట్టూవున్న వాతావరణం సరిగ్గా లేకపోవడం వలన నాకు ఏదో హాని సంభవించబోవుచున్నదని భయం కలుగజేసే ఆలోచనలున్నాయని గుర్తించాను. అటువంటి భావన నాకు చాలాసార్లు కలిగిందని నేను గ్రహించాను. 

     ప్రభువా, "నాకు ప్రతిసారి ఉండే ఈ ఆలోచన ఏమటి ?" అని అడిగాను. "చెడ్డ సూచనలు" అని ఆయన జవాబిచ్చాడు.  ఆ సమయంలో నా జీవితంలోన ఎక్కువ భాగం చెడుతలంపులవలనను, చేదు సూచనలవలనను దయనీయముగా నుండెనని నేను గ్రహించాను. అవును, క్లిష్టపరిస్థితులను నేను కలిగియున్నాను. నా ఆలోచనలు నా బాహ్య జీవితాన్ని ఆనందంగా గడిపే శక్తిని,మంచి రోజులను చూసే శక్తిని దొంగిలించాయి. 

No comments:

Post a Comment