విశ్వాసము, శక్తివంతమైన విశ్వసం !
"లోకమును జయించిన విజయము మన విశ్వాసమే" (1 యోహాను 5:4)
పాపం ఎలాగూ విజయమును సాధించగలము? సమస్యలన్నిటి సమస్య ఇది. పాపమును గూర్చిన ఒక సంక్షిప్త సమగ్ర వివరణ 1యోహాను 2:16 లో ఇయ్యబడింది. "లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే." సర్వ పాపములు ఈ మూడింటిలోనికే వస్తాయి.
ఉదాహరణకు, ఆదాము హవ్వలు ఎదుర్కొనిన శోధన. ఆ ఫలము తినుటకు మంచిదై యుండెను - ఇది శరీరాశ; అది కన్నులకు అందమైనదిగా నుండెను - ఇది నేత్రాశ; వారు ఆ ఫలము తింటే దేవతలవంటి వారవుతారని వారికి వాగ్దానము చేయబడింది - ఇది జీవపుడంబము. రెండవ ఆదామైన యేసుక్రీస్తు వేరే సందర్భంలో ఇవే శోధనలు ఎదుర్కొన్నాడు. "ఈ రాళ్లు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుము"- శరీరాశ; "ఆయనను మిగుల ఎత్తయిన ఒక కొండమీదికి తీసికొనిపోయి, ఈ లోక రాజ్యములన్నిటిని ఆయనకు చూపించెను" - నేత్రాశ; "ఇక్కడ నుండి క్రిందికి దుముకుము; నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించును" - జీవపుడంబము. యేసు ఈ శోధనలన్నిటిపై విజయము పొందెను. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము కూడా ఈ శోధనలన్నిటిపై విజయము పొందెదము.

No comments:
Post a Comment