Tuesday, May 5, 2020

Willingness of god

సిద్దమనస్సు 

     "వీరు థెస్సలొనీకలో ఉన్నవారికంటే ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నావో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి." ఆ. కార్య 17:11. 


       మనము సిద్దమనసు కలిగియుండాలని బైలులు చెప్పుచున్నది. అంటే మనయెడల దేవుని చిత్తము ఏమైయున్నాను ఆ చిత్తము యెడల మన మనస్సులు తెరచిన మనస్సులుగా ఉండాలని అర్ధం. 
         కొన్నిసార్లు రోజులు మనకు అనుకూలించవు గనుక దానికి మనము "సిద్దమనస్సు" ను కలిగియుండాలి, మనము ప్రతికూల స్వభావము కలిగియుండకూడదు. ఎప్పుడైతే మనము ప్రతికూల స్వభావము కలిగియుంటామో అప్పుడు దేవుడు మన యెడల చేయాలనీ అని అనుకున్న కార్యములు నెరవేరవు కనుక నా ప్రియ స్నేహితులారా మనము ఎప్పుడు సిద్దమనస్సు కలిగియుండి ఏది సంభవించినను ప్రభువునందు నమ్మకముంచుము. 

          ఎందుకంటే మనలని మనకంటే ఎక్కువగా మనలను ప్రేమించే మన పరమ తండ్రి కనుక మనము అందరమూ అనగా మీరు నేను ఆ దేవాతి దేవుడి మీద సకల భారం మోపి విశ్వాసం కలిగియుండుము గాక. ఆమెన్ హల్లెలూయా.... 

No comments:

Post a Comment