భూమిమీద నిన్ను మహిమపరచితిని
నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైయున్నది. పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు. నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా? అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. ఈ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమపరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను. నీవు నమ్మినయెడల దేవుని మహిమచూతువని నేను నీతో చెప్పలేదా? యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నాను. అప్పుడందరును ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటలకాశ్చర్యపడిరి. నీవు .... యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజాలోను ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని, మా దేవునికి వారికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి;గనుక వారు భూలోకమందు ఏలుచున్నారు.
--------------------------------------------------------------------------------------------------------------------------
యోహాను 17:4; యోహాను 4:34; యోహాను 9:4; లూకా 2:49, 50; యోహాను 11:4,40; లూకా 2:52; లూకా 3:22; లూకా 4:22; ప్రకటన 5:9,10

No comments:
Post a Comment