యెహోవా హస్తము
రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. యెషయా 59:1
నేను మొఱ్ఱపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రయాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థనచేయుచునుండగా, మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు నామయమున నాకు కనబడి నన్ను ముట్టెను.
నీ ముఖమును నాకు దాచకుము, కోపముచేత ని సేవకుని తోలివేయకుము, నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. యెహోవా, దూరముగా నుండకుము. నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము.
యెహోవా, ప్రభువా, సైన్యముల కధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, ని అధిక బలముచేతను చాచిన బాహువుచేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు. అయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును .... అయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణగలవారమైయున్నాము. దేవుడు తాను ఏర్పరచు కొనినవారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యామము తీర్చును;వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆమెన్. హల్లెలూయ

No comments:
Post a Comment