Saturday, June 27, 2020

Empty is the place

ఖాళీ స్థలమే స్థానము

     అపవాదికి చోటియ్యకుడి; ఎఫెసీ 4:27

    మనము సాతానుకు ఇచ్చే స్థలము ఖాళీగా ఉన్నదే. ఖాళీగా ఉన్న మందిమతియైన మనస్సే చెడుతలంపులకు మూలమైన స్థలము. 

     ఒక విశ్వాసి మందమతి తత్వము కలిగి చెడుతలంపులను ఎదుర్కొననప్పుడు అవి తన సొంత తలంపులుగానే భావిస్తాడు. తనయందు ఖాళీ స్థలములోనికి సైతాను నింపబడినట్లుగా గ్రహించలేడు. 

 ఒకవిధముగా చెడ్డ తలంపులు మనలోకి రాకుండా చేయటకు మంచి తలంపులు కలిగియుండుటయే. దుష్టుని తరిమివేయవచ్చుగాని, అతడు ఎండిన స్థలములలో తిరుగులాడుచున్నాడు. అవకాశము కొరకు వెదకుచున్నాడు. పరిశుద్ధగ్రంధంలో పరి. లూకా 11:24-25 నున్నట్లు అపవాది తిరుగాడుచు తానూ ఖాళీ చేసిన స్థలము ఖాళీగా ఉన్నందున మరికొన్ని దురాత్మలను తనతోపాటు తీసుకొనివచ్చి ఆ స్థలములో నుండుననియు అప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితము పూర్వపు స్థితికంటె మిక్కిలి చెడ్డదిగా ఉండునని గ్రహించగలము. ఇందువలన ఏ వ్యక్తిలో నుండియైన దురాత్మను పారద్రోలినప్పుడు అతనిలోని ఖాళీ స్థలమును ఏలాగున దైవాత్మతో నింపగలమో ముందుగా తెలుపవలెను. 

No comments:

Post a Comment