Monday, May 18, 2020

A Disturbed Mind

అస్తవ్యస్త పరిస్థితిలోపడ్డ మనసు


  "మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు". 
  "అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును". 
 "అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువువలన తనకేమైనను దొరుకునని తలంచు కొనరాదు". యాకోబు 1:5-8 

  ఆశ్చర్యపోవడం, కలవర పడ్డం అనేవి బంధువులని తెలుసుకొన్నంగదా. స్థిరమైన ఆలోచన కలిగి వుండడానికి బదులు ఆశ్చర్యపోయినందువలన అది సందేహాన్ని, కలవరాన్ని, కలిగిస్తుంది. 

  విస్మయాన్ని, సందేహాన్ని, కలవరాన్ని అధిగమించి మన అవసరమేమిటో దాన్ని దేవుని నుండి ఎలా పొందగలమో యాకోబు 1:5-8 బాగా వివరిస్తోంది. నాకైతే "ద్విమనస్కుడు" అంటే దేన్నీ ఎప్పటికి నిర్ణయించు కోలేక వెనుకా ముందు చూచేవాడు అనిపిస్తుంది. అతడు ఆలోచించిన వెంటనే అతడొక నిర్ణయం చేస్తాడు. అలా చేసినప్పుడు విస్మయం, సంశయం, కలవరం కలిగి మళ్లీ అతణ్ణి ద్విమనస్కుణ్ణి చేస్తాయి. అలాటి వాడు అన్నిటిని గురించి అనిశ్చితంగా వుంటాడు. 

 సాతాను నా మీద యుద్దం ప్రకటించాడని, నామనస్సే యుద్ధరంగమని గ్రహించక ఇలా సందిగ్ధంతో చాలా కాలం జీవితాన్ని నడిపాను. అలా ఎందుకైందో అర్ధంగాక అన్నింటికి పూర్తిగా తబ్బిబ్బుపడి పోయాను. 

No comments:

Post a Comment