Tuesday, May 19, 2020

Logic drives the idea of ​​manipulation

తర్కం తారుమారు ఆలోచనకు నడుపుతుంది 


   "యేసు అది యెరిగి అల్పవిశ్వాసులారా మనయొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు"? మత్తయి 16:8

   ఇప్పటి వరకు ఆశ్చర్యపడ్డాన్ని గురించి చెప్పుకొన్నాం. సందేహాన్ని గురించి మరింతగా తర్వాత అధ్యాయంలో చెప్పుకొందాం. ఇప్పుడు కలవరం లేక తారుమారవడాన్ని గురించి వివరిస్తాను. 

    దేవుని ప్రజల్లో ఎక్కువ శాతం మంది నిస్సందేహంగా కలవరపడే వారే. ఎందుకని? అంటే మనం పరిశీలించినట్టు ఒక కారణం వారు విస్మయపడతారు. మరో కారణం వారిలో తర్కం లేక హేతువాదం వుంటుంది. డిక్షనరీలో తర్కం - లేక హేతువాదం  అంటే "గమనించదగిన వాస్తవం లేక ఒక విషయం జరగడానికి తార్కికంగా కలిగిన ఉద్దేశం - అని, క్రియాపదంలో - హేతుబద్దమైన వివేకాన్ని ఉపయోగించుట; లేక హేతు బద్దంగా ఆలోచించుట" అని అర్ధాలున్నాయి. 

   దాన్ని సులభంగా చెబితే - ఒక దాని వెనుక ఒకటి వున్నా "ఎందుకు" అన్నదాన్ని వివరించడానికి ప్రయత్నించినప్పుడు ఈ తర్కం లేక కార్య కారణాంశం వస్తుంది తర్కం ఒక విషయాన్నీ కూలంకషంగా తెలుసుకోడానికి దాని ఆలోచించేట్టు చేస్తుంది. ఒక వివరణను గాని, ఒక బోధనాంశాన్ని గాని అది హేతుబద్దంగా వుందో లేదో తెలుసుకోడానికి దాన్ని ఏ భాగానికా భాగం విడదీసి చూసి అది సరిగ్గా వుందో లేదో సరిచూస్తాం. 

   ఈ హేతువాదంతోనే సాతాను మనలో వున్న దేవుని వాక్యాన్ని తరచుగా దొంగిలిస్తూ ఉంటాడు. అయితే ఫలానా పని చేయండని దేవుడు మనలను నిర్దేశిస్తూనే వుంటాడు. అయితే అది మనకు అర్ధం కాకపోతే - చేయడానికి శోధనలోపడతాం. దేవుడు ఒక వ్యక్తిని ఏంచేయమని నడిపిస్తాడో అది ప్రతిసారీ అతనికి హేతు బద్దంగా అనిపించకపోవచ్చు. అతని ఆత్మ దాన్ని దృఢపరచ వచ్చుగాని అతని మనస్సు దాన్ని తిరస్కరించ వచ్చు. మరి ముఖ్యంగా దేవుడు చేయమన్నది అసాధారణమైనది, లేక స్వప్రయోజనాన్ని త్యాగం చేయడం, లేక స్వసుఖాన్ని త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు మరింత తిరస్కార భావం 

No comments:

Post a Comment