దేవుని నమ్మాలిగాని
(మానవ హేతువాదాన్ని నమ్మకూడదు)
"నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము". సామెతలు 3:5
మరో మాటలో చెప్పుకొంటే హేతువాదం మీద ఆధారపడకు అని, హేతువాదం మోసానికి అవకాశమిచ్చి మరింత కలవరాన్ని కలిగిస్తుంది.
ప్రభువా ఎందుకింత మంది కలవరపడుతున్నారని అడిగితే, "ప్రతిదాన్ని లెక్కించడం ఆపితే వారు కలవరపడకుండా వుంటారు. అని వారికీ చెప్పు అని జవాబిచ్చాడు". అది అక్షరాలా వస్తావం అని నేను తెలుసుకున్నాను. హేతువాదం కలవరం ఒకదానితో ఒకటి కలిసే వుంటాయి.
మీరుగాని, నేనుగాని ఒక విషయాన్నీ హృదయంలో అన్వేషిస్తే దాన్ని ప్రభువుముందుంచి దాన్ని గురించిన అవగాహనా మనకివ్వాలని అపేక్షిస్తున్నాడో లేదో వేచి వుండాలి. కానీ మనం ఎంత చిన్న తడబాటుపడినా అది మనలనెంతో కలవరపెడుతుంది.
అనేక కారణాల వలన హేతువాదం చాలా ప్రమాదకరమైంది, అందులో ఒకటి ఒక విషయాన్ని గురించి కార్యకారణాలను వెదకి బయటికి తీస్తే అదేదో మనకు అర్ధం అయినట్టు అనిపిస్తుంది. అయితే అదే సరైనదని మనం యోచించినది అసలు సరైనది కానేకాదని తలుస్తా.
మానవ మనస్సు తర్కాన్ని, క్రమాన్ని, హేతువాదాన్ని ఇష్టపడుతుంది. దానికి అర్ధమైన దానితో వ్యవహరించడానికి ఇష్టపడుతుంది. కాబట్టి అది ఇక్కడ బాగా సరిపోతుంది గనుక దాని దారి ఇదే అని అలోచించి మన మనసులోని చిన్న చిన్న భాగాల్లో దాన్ని పదిలపరచే తత్త్వం మానవులమైన మనకి వుంది. మన మనసులు సుఖంగా వున్నాయనుకొంటాం, కాని అవి పూర్తగా తప్పు.

No comments:
Post a Comment