క్రీస్తును తప్ప మరిదేన్ని తెలుసుకోకూడదని నిశ్చయించుకోవాలి.
"సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను".
"నేను, యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప, మరిదేనిని మీమధ్య నెరుగకుందునని నిశ్చ యించుకొంటిని". 1 కొరింథీ 2:1-2
జ్ఞానాన్ని గురించి, హేతువాదాన్ని గురించి పౌలు విధానం ఇది, దాన్ని నేను అవగాహన చేసుకొని, అభినందిస్తున్నాను. అనేక సందర్భాల్లో నాకెంత తక్కువ తెలిస్తే నేనంత ఆనందంగా వున్నానని తెలుసుకోడానికి నాకు చాలా కాలం పట్టింది. కొన్ని సార్లు అది మనలను పూర్తి అసంతోషంలో వుంచుతుందని తెలుసుకోగలుగుతాం.
నేనెప్పుడూ తెలుసుకోవాలని, విమర్శించి తెలుసుకోవాలన్న ఆసక్తితో వుంటాను. సంతృప్తి పొందాలంటే ప్రతిదాన్ని లెక్క చూడాలనుకొంటాను. అయితే నా ఎడతెగని హేతువాదం నాలోని కలవరానికి మూలం అని, దేవుడు నాకివ్వాలనుకొన్నదాన్ని పొందకుండా అది నన్ను ఆటంకపరుస్తున్నదని దేవుడు నాకు చూపించడం మొదలు పెట్టాడు. "జాయిస్, నీవేప్పుడైనా దేన్నైనా తెలుసుకోవాలంటే నీ హేతువాదాన్ని పక్కనపెట్టు" అని ఆయన నాతో చెప్పాడు.
ఇక ఇప్పుడు నా జీవితంలో మిగిలిన ఆంతార్యలుండకూడదని కోరుకుంటున్నాను. నేను నా అదుపులో వుండాలను కొంటున్నాను. విషయాలు నాకు అర్ధం కానప్పుడు, నేను అదుపుతప్పానని భావించాను - భయపడ్డాను. కాని నాలో ఏదో కొరత వుంది. నాకు మనశ్శాంతి లేదు. హేతువడంతో శారీరకంగా నేను అలసిసొలసిపోయాను.
నేను ఆ హేతువాదాన్ని విడిచి పెట్టిన తర్వాత హేతువాదంతో నా ఆలోచనలతో ఎంతో సమయాన్ని గడిపాను. నా మనస్సుతో ప్రశాంతంగా ఉండడానికి అలవాటు పడాల్సివచ్చింది. కొంతసేపు అది విసుగనిపించేది ఏమీ తోచక, కానీ యిప్పుడు నేను దాన్ని ప్రేమిస్తున్నాను. అన్నింటి మీద నా మనస్సు తిరుగుతూ వుండేది ఒకప్పుడు. ఇప్పుడు హేతువాదంతో కలిగే తలనొప్పిని, కృషిని నేను సహించలేను.
మన మనస్సు ప్రశాంతంగా వుండాలని కోరుతున్నాడు దేవుడు, హేతువాదం సామాన్య స్థితిని కలిగించదు.
మనస్సు హేతువాదంతో నిండి వున్నప్పుడు అది సామాన్య స్థితికాదు, జాగ్రత్తగా వుండాలి. కనీసం విజయవంతంగా ఉండాలన్న క్రైస్తవునికే కాదు. మానసికమైన యుద్ధరంగంలో పోరాటాన్ని జయించాలని కోరుకునే విశ్వాసి హేతువాదాన్ని గురించి జాగ్రత్తగా వుండాలి.

No comments:
Post a Comment