Friday, May 22, 2020

A Disturbing, Disturbing Mind

శంకిస్తూ, అపనమ్మకంలో కొట్టమిట్టాడే మనసు 


"... అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను". మత్తయి 14:31
".... ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను". మార్కు 6 :5

  సందేహం, అపనమ్మకం రెండూ ఒకటే అన్నట్టు ఆ రెంటినీ కలిపి మాట్లాడుతూ వుంటాం సహజంగా. ఆ రెంటికీ సంబంధం వున్నా వాస్తవానికి ఆ రెండూ వేర్వేరు అంశాలు. 

   సందేహం - అంటే క్రియాపదంలో- "రెండు మార్గాల్లో నిలుచుట... ఏ మార్గాన్ని ఎంచుకోవాలన్న సందిగ్దత; ....విశ్వాసులకు అన్వయించి - వారి విశ్వాసము తక్కువ... ఆతృత కలిగి వుండుట, దారి తప్పిన మనోస్థితి, నిరీక్షణ, భయముల మధ్య వూగిసలాడుట..." అని వివరిస్తోంది వైన్స్ ఎక్స్ పోజిటరీ డిక్షనరీ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంటు. 

  అదే డిక్షనరీ వివరణలోని రెండు గ్రీకు పదాల్లో ఒకదాన్ని అపనమ్మకం అని అనువదించారు, "అవిధేయత" అని కూడా కొన్ని బైబిలు వ్రతాల్లో అనువదించారు. 

  శత్రువునకున్న పరికరాల్లో ఈ రెండూ శక్తివంతమైనవి. ఈ రెండు పదాలను పరిశీలించి చూద్దాం. సందేహం (అనుమానం) అనేది ఒక వ్యక్తిని రెండు ఉద్దేశాల మధ్య వూగిసలాడేట్లు చేస్తుంది, అపనమ్మకం అవిధేయతకు నడుపుతుంది. 

  సాతాను మనపై దాడి చేయాలని ప్రయత్నిస్తుండగా వీటిని గురించి సరిగ్గా గుర్తించడం మనకు సహాయకరంగా ఉంటుందని నా నమ్మకం. మనం సందేహాన్ని లేక అపనమ్మకన్నా దేన్నీ గురించి ఆలోచిస్తున్నాం?

No comments:

Post a Comment