Wednesday, May 27, 2020

Doubt is an Option


 అనుమానం ఒక ఎంపిక


     "ఉదయమందు పట్టణమునకు మరల వెళ్లుచుండగా ఆయన ఆకలిగొనెను".

  "అప్పుడు త్రోవప్రక్కను ఉన్న యొక అంజూరపుచెట్టును చూచి, దానియొద్దకు రాగా, దానియందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు గనుక దానిని చూచిఇకమీదట ఎన్నటికిని నీవు కాపు కాయ కుందువుగాక అని చెప్పెను; తక్షణమే ఆ అంజూరవు చెట్టు ఎండిపోయెను".

     "శిష్యులదిచూచి ఆశ్చర్యపడిఅంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి".

   "అందుకు యేసుమీరు విశ్వాసముగలిగి సందేహపడకుండిన యెడల, ఈ అంజూరపుచెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచినీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పిన యెడల, ఆలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను". 

  "మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మిన యెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను". మత్తయి 21 : 18-22


    విశ్వసం దేవుడిచ్చేవరమని ఇప్పటికే మనం తెలుసుకున్నాం గనుక మనలో విశ్వసముందని మనకు తెలుసు (రోమా 12:3). అయితే అనుమానం ఎంచుకొనేది. అది మన మనస్సులకు వ్యతిరేకంగా సాతాను ఉపయోగించే యుద్ధతంత్రం. 

   మీ సొంత ఆలోచనలను మీరు ఎంచుకోవాలి గనుక అనుమానం వచ్చినప్పుడు అదేమిటో గురించడం మీరు నేర్చుకొని "వద్దు థాంక్యూ అని చెప్పి విశ్వాసంతో ఉండండి!

     ఎంచుకొనే అవకాశం మీదే!

No comments:

Post a Comment