Saturday, May 30, 2020

Eager, The Mind that is in Anxiety

ఆతృతతో, ఆందోళనలో ఉండే మనసు 


     "వ్యసనపడకుము...." కీర్తనలు 37:8

  మనం దేవునికి సేవ చేయకుండా మన మనస్సును మరల్చడానికి మనస్సుపై దాడి చేయడానికి ఉద్దేశించినవే వ్యాకులత, విచారం అనేవి. మన విశ్వాసం లేచి విజయవంతంగా జీవించడానికి సహాయం చేయకుండా ఉండేట్టు ఆ విశ్వాసాన్ని మరిలేవకుండా అణచివేయడానికి శత్రువు ఈ రెండు పీడలను ఉపయోగించుకొంటాడు. 

    కొందరికి విచారం సమస్యగా ఉంటుంది. వారు దానికి అలవాటుపడిపోయారు అని అంటారు కొందరు. అలాటివారు తాము విచారించడానికి తమ స్వంతమైనవేవి లేకపోతె, ఇతరుల పరిస్థితికి విచారించేంతగా ఆ విచారానికి అలవాటుపడిపోతారు. నాకి సమస్య వుంది గనుక ఈ పరిస్థితిని వివరించగల యోగ్యతా నాకు ఉంది. 

 నేను ఎడతెగక ఒకదాన్ని గురించి విచారిస్తూ ఉంటాను గనుక క్రీస్తు మరణించి నాకివ్వాలనుకొన్న సమాధానాన్ని నేను అనుభవించలేకపోతున్నాను. 

   ఒకేసారి విచారిస్తూ సమాధానంగా జీవించడం పూర్తిగా అసంభవం. 

  సమాధానం ఒక వ్యక్తిమీద పెట్టే సస్తువుకాదు; అది ఆత్మఫలం (గలతి 5:22) ద్రాక్షావల్లిలో అంటు కట్టబడి ఉండడం వల్లనే ఫలిస్తుంది (యోహాను 15:4) హెబ్రీ నాల్గవ అధ్యాయంలో చెప్పిన "దేవుని విశ్రాంతి" లో ప్రవేశించడమే కట్టబడి వుండుట అన్నదాన్ని తెలియజేస్తుంది. 

  విచారాన్ని గురించి వివరించే పదాలు బైబిల్లో అనేకం ఉన్నాయి. అదే కీర్తన 37:8 లో "వ్యసన పడకుము" అని, మత్తయి 6:25 "చింతింపకుడు" అని, ఫిలిప్పీ 4:6 లో "దేని గురించి చింతపడకుడి" అని, 1 పేతురు 5:7 లో "మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి " అని అనువదించారు. అయినప్పటికీ నేను "విచారం" అన్న పదాన్ని ఉపయోగిస్తాను. 

No comments:

Post a Comment