Wednesday, May 13, 2020

Excessive Lemon Tone

మిక్కిలి నిమ్మళముగల స్వరము 


     "అందుకాయన నీవు పోయి పర్వతముమీద యెహోవా సముఖమందు నిలిచి యుండుమని సెలవిచ్చెను. అంతట యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి వీచెను, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను; శిలలు ఛిన్నా భిన్నములాయెను గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను". 1 రాజులు 9:11,12. 

    సంవత్సరముల తరబడి నాలో నివసించు పరిశుద్దాత్ముని వలన ప్రత్యక్షత పొందుటకు దేవునిని అడుగుతూవున్నాను. అది లేఖనపరమైన అభ్యర్థనయేనని నాకు తెలుసు. నేను వాక్యమును విశ్వసించాను, నేను అడిగినది పొందుతానని ఖఛ్చితముగా తలంచేదానిని. కానీ చాలాసార్లు నేను " ఆత్మీయముగా బుద్దిమాంద్యపు" స్థితిలో ఉండేదానిని. పరిశుద్ధాత్ముడు నాకు ప్రత్యక్షపర్చవలెనని కోరినదానిని అంతయు పొందడంలేదని తెలుసుకున్నాను. ఎందుకంటే నా మనసు మొరటుగాను, పనుల భారముతోను నిండిపోయింది. అందుకే వచ్చుచున్న సమాచారాన్ని అది పొందలేకపోవుచున్నది. 

    ఇద్దరే వ్యక్తులు ఒక గదిలో ఉన్నట్లు ఊహించు, ఒకరు ఇంకొకరికి రహస్యాన్ని చెవిలో చెప్పుటకు ప్రయత్నిస్తున్నాడు, ఆ గది  అల్లరితో నిండియున్నప్పటికీ సమాచారము అందించబడుచున్నది. ఆ రహస్య శబ్దాన్ని వినుటకు ఆతృతపడేవానికి అది వినిపించదు ఎందుకంటే గది అంతా గోల గోలాగావున్నది. ఒకడు తదేకంగా శ్రద్ద చూపనిచో అసలు అవతలి వ్యక్తి తనతో మాట్లాడుచున్నట్లు గ్రహించలేడు. 

     దేవుని ఆత్మకును మన ఆత్మకును మధ్యవున్న సంబంధ బాంధవ్యమునకు ఇదే దారి. పరుశుద్దాత్ముని దారులు సరళమైనవి. "మిక్కిలి నిమ్మళమైన స్వరము" తో ఈ పాఠ్యభాగములో ఆయన ప్రవక్తతో మాట్లాడినట్లు మనతోకూడ అనేకమార్లు చెప్పుచున్నాడు. కనుక వినిపించుకొనెడు స్వభావమును మనం వృది చేసుకొనడం మనకెంతో అవసరం. 


No comments:

Post a Comment