మనసు - ఆత్మ సిద్ధాంతం
"ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు". 1 కొరింథీ 2:11
ఒక వ్యక్తి క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించునపుడు పరిశుద్ధాత్ముడు అతనిలో నివసించుటకు వచ్చును. దేవుని మనస్సును ఎరిగినవాడు పరుశుద్దాత్ముడేనని బైబిలు బోధించుచున్నది. ఒకని సొంత ఆత్మ మాత్రమే తన తలంపులను ఎరుగునో అట్లే దేవుని ఆత్మ మాత్రమే దేవుని యొక్క మనస్సును గ్రహించగలవాడు.
పరిశుద్ధాత్ముడు మనలో నివసించుచున్నాడు. గనుక ఆయనకు దేవుని మనస్సు తెలుసు కనుక ఆయన ఉద్దేశములలో ఒకటి ఏమిటంటే దేవుని జ్ఞానమును, ప్రకటనను మనకు బయలుపర్చుటయే. జ్ఞానము, ప్రకటన మన ఆత్మలో నాటబడి మన హృదయనేత్రాలను మన ఆత్మ వెలిగిస్తుంది అదే మన మనస్సు. పరిశుద్ధాత్ముడు దీనిని చేయును గనుక ఆత్మీయముగా మనకు ఏమి పరిచర్య జరుగుచున్నదో వాస్తవంగా మనం అర్థంచేసుకొనగలం.

No comments:
Post a Comment