Tuesday, May 12, 2020

When my Mood was Normal


నా మానసిక స్థితి మామూలుగా ఉండేదెప్పుడు?



     "మరియు మీ మనో నేత్రములు వెలిగింప బడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరి మితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను". ఎఫెసీ 1:17,18,19. 

     నీవు నేను మన "హృదయనేత్రాలు" వెలిగించబడినప్పుడే మనకు జ్ఞానము వచ్చునని పౌలు చెప్పుచున్న మాట గమనించుదాము. నేను చదివిన అనేక విషయాలను ఆధారం చేసుకొని "మన హృదయనేత్రాలు" అంటే మన మనస్సు అని గ్రహించాను. 

      క్రైస్తవులముగా మన మనసు ఏ స్థితిలో ఉండాలి? వేరేమాటలో చెప్పాలంటే విశ్వసియొక్క మామూలు స్థితి ఎట్లుండాలి? ఐ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే మనసు యొక్క మరియు ఆత్మ యొక్క వివిధ కార్యకలాపములను మనం చూడవలసియుంది. 

   దైవవాక్కు ప్రకారం మనసు, ఆత్మ కలిసి పనిచేస్తాయి. దీనిని "ఆత్మకు మనసు సాయపడటం" అని అంటాను. ఈ సిద్ధాంతమును అర్ధం చేసుకోవడానికి విశ్వాసి జీవితంలో ఇది ఎలా పని చేస్తుంది. 

నా ప్రియ స్నేహితులారా ఈ పాఠ్యభాగం ఇంకా ముగింపు కాలేదు తరువాతి సంచికలో కలుద్దాం.... 

No comments:

Post a Comment