ఈ విషయాలను ఆలోచించు
"మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్య మైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి". ఫిలిప్పీ 4:8
ఎటువంటి విషయాలను మనం మన్ననచేయవలెనో బైబిలు మనకు విస్తారముగా చెప్పుచున్నది. ఇన్నిరకాల వచనములనుండి మనము మంచి విషయాలపై, మనలను ఒక్కటిగా చేయువాటిని, మనలను చీల్చనట్టివాటిని ఆలోచన కలిగియుండుటకు హెచ్చింపవడుచున్నాము.
మన ఆలోచనలు ఖచ్చితముగా మన ప్రవర్తనలపైనను మనం వ్యవహరించే తీరుపైనను ప్రభావం చూపుతాయి. మనలను ఏది సంతోషపర్చునో ఏది దుఃఖపెట్టునో ఆయనకు తెలుసు. ఒక వ్యక్తి తప్పు ఆలోచనలతో నిండియుంటే అతడు దుఃఖముతో వుంటాడు, మరియు ఒకడు దుఃఖస్థితిలో ఉన్నప్పుడు అతడు ఇతరులను కూడ అదే స్థితిలోనికి దించుతాడని నేను అనుభవపూర్వకముగా నేర్చుకున్నాను.
ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకొని నిన్నునీవే "ఇప్పటివరకు నేనేమి ఆలోచించుచున్నాను?" అని ప్రశ్నించుకోవాలి. నీ ఆలోచనా జీవితాన్ని కొంతసేపు పరీక్షించి చూచుకో.
నీవేమి తలంచుచున్నవో దానిని గూర్చి ఆలోచించడం చాల అవసరం ఎందుకంటే ప్రజల దుఃఖమునకు కారణము మరియొకటని తప్పుదారిని పట్టించుటకు సాతానుడు ప్రయత్నిస్తుంటాడు. వారిచుట్టు ఉన్న (వారి పరిస్థితుల) కారణముగా వారు దుఃఖములో ఉన్నారని ప్రజలు తలంచాలని సాతానుడు కోరుచున్నాడు. కానీ దుఃఖమనేది తమ అంతరంగములో (తమ ఆలోచనలలో) జరిగే మార్పునుబట్టి వస్తుంది.
చివరిగా "నువ్వు ఆలోచించేదానిని గూర్చి ఆలోచించు". నీ యొక్క కొన్ని సమస్యలను నీవు గ్రహించవచ్చును, విడుదల మార్గాన అతి త్వరగా నీవు ప్రయాణించవచ్చును.

No comments:
Post a Comment