నీ మనస్సును నూతనపర్చుకొని రూపాంతరము చెందు
"మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి". రోమా 12:2
మనము దేవుని యొక్క మంచిదియు, సంపూర్ణమునైయున్న చిత్తమును మన జీవితాలలో నెరవేరునట్లు చూడగోరినయెడల మనము మన మనస్సులను నూతనపర్చుకోవాలని అపోస్తులుడైన పౌలు ఈ పాఠ్యభాగములో చెప్పుచున్నాడు. దేనికి నూతనపర్చబడాల? దైవమార్గమును ఆలోచించుటలో నూతనపర్చబడుటకు ఈవిధమైన కొత్త ఆలోచనద్వారా మనం మారుతాము. లేక మనం ఏమైయుండవలెనని దేవుడు మనయెడల ఆశించుచున్నాడో అట్లు రూపాంతరము చెందగలం. యేసు ఈ రూపాంతరమును తన మరణపునరుత్తనముల ద్వారా సాధ్యము చేసియున్నాడు. ఇటువంటి మనస్సు నూతనత్వము పొందు పద్ధతిద్వారా మన జీవితాలలో నిజమవుతుంది.
ఎటువంటి గలిబిలి లేకుండుటకు సరియైన ఆలోచన అనేది రక్షణతో సంబంధంలేదని మనం ఇక్కడ చెప్పుకుందాం. రక్షణ అనేది కేవలం యేసు రక్తములోనే ఆధారపడియున్నది. ఆయన సిలువ మరణములపైనను, ఆయన పునరుత్తనంపైనను ఆధారపడియున్నది. అనేకులు పరలోకంలో ఉంటారు ఎందుకంటే వారు యేసును వారి రక్షకునిగా అంగీకరించారు, కాని విరిలోనే అనేకులు విజయములోనికి నడువరు లేక దేవుడు వారి జీవితాలలో వేసియున్న మంచి ప్రణాళికలో ఆనందించరు ఎందుకంటే వారు ఆయన వాక్యప్రకారముగా తమ మనస్సులను నూతనపర్చుకొనబడకపోవుటను బట్టియే.

No comments:
Post a Comment