Friday, May 15, 2020

Representation is a Rotating Mind

ప్రతినిత్యం పరిభ్రమించే మనసు (Part-1)



"కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బర మైన బుద్ధిగలవారై........." 1 పేతురు 1:13

     ఎప్పుడూ విరామమెరుగని మనస్సు అసాధారణమైనదని గత అధ్యాయంలో చెప్పుకొన్నం. అసాధారణమైన మనస్సంటే మరో పరిస్థితిగల మనస్సు. అది అన్నిటిని గురించి ఆలోచిస్తూ వుంటుంది. దేని మీద మనస్సును లగ్నం చేయలేకపోవడం అంటే దానిపై సాతాను చేసేటి దండయాత్రను సూచిస్తుంది. 

    చాల మందికి క్రమ పద్దతి లేక పోవడం వలన స్థిరమైన ఆలోచనలు లేకనే సంవత్సరాలు గడిచి పోతున్నాయి. 

 ఎవరైతే ఒక ఆలోచనపై మనస్సును కేంద్రీకరించలేరో వారిలో మానసిక లోపం వున్నాడన్నమాట. ఏమైనప్పటికి దానిష్ట ప్రకారం చేయడానికి అలవాటు పడిన ఫలితమే మనస్సును లగ్నం చేయలేకపోవడం. మనస్సును ఒకదానిపై కేంద్రికరించ లేకపోవడం ఆ వ్యక్తిలో విటమినుల లోపం వున్న లక్షణాన్ని తెలియజేస్తుంది. కొన్ని బి.విటమినులు కేంద్రీకరణ శక్తిని పెంపొందిస్తాయి. కాబట్టి, మీలో మనస్సును ఒకదానిపై లగ్నం చేయలేని లోపం వుంటే మీరు సరైన, పుష్టికరమైన ఆహారాన్ని తీసుకొంటున్నారో లేదో పరిశీలించుకోండి. 

     తీవ్రమైన అలసట కూడా మనస్సును ఒక దానిపై లగ్నం చేయలేని స్థితిని కలిగిస్తుంది. నేను బాగా అలసిపోయిన స్థితిలో సాతానును ఎదిరించి అడ్డగించ లేనని అతడికి బాగా తెలుసు. గనుక ఆ అలసిపోయిన స్థితిలో అతడు నా మనస్సుపై దాడి చేస్తుంటాడని నేను తెలుసుకున్నాను. మనకు మానసిక లోపం వుందని, కనుక అతనికి సమస్యలు కలిగించే వాటిని మనం ప్రయత్నించ కూడదని సాతాను అభిలషిస్తాడు. అతడే అబద్దాలు చెబితే వాటిని మనం మౌనంగా అంగీకరంచాలని కోరుకుంటాడు. 

     చాలా సార్లు మనస్సును లగ్నం చేయక పోవడం వల్లనే గ్రహింపు లేకుండా పోతుంది. అలాటి అనుభవం నాకూ వుంది. కొన్ని సార్లు బైబిల్లో  ఒక అధ్యాయాన్నో లేక మరో పుస్తకాన్నో చదివిన తర్వాత అసలు నేనేం చదివానో నాకే తేలిసేదికాదు. అప్పుడు నేను మళ్ళీ చదివిన దాన్నే మరలా చదివేదానను అంతకుముందు నా దృష్టి ఆపేజీల్లోని అక్షరములను చదివినా నా మనస్సు ఏవేవో ఆలోచిస్తూ వుండేది. కనుక యిప్పుడు మళ్ళీ చదువుతూ వుంటే అంతా కొత్తగా అనిపించేది. నేనేం చేస్తున్నానో దానిపై మనస్సును లగ్నం చేయలేదు కనుక నేను చదివిన దాన్ని గ్రహించలేక పోయాను. 

    చాలాసార్లు ఆలా అర్ధం కాకపోవడానికి కారణం చంచలమైన మనస్సు చేస్తున్న పని మీద కేంద్రీకరించలేక పోవడమే.  

No comments:

Post a Comment