ప్రశాంతమైన, జాగరూకతగల మనస్సు
"ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు". యెషయా 26:3
ఈ ఉదాహరణల నుండి నీ మనసు, నీ ఆత్మ ఖచ్చితముగా కలసి పనిచేయునని చక్కగా చూడగలవని విశ్వసిస్తున్నాను. కనుక నీ మనస్సును మాములు స్థితిలో పెట్టుకోవడమనేది చాల ముఖ్యమైన విషయమైయున్నది. లేకుంటే అది నీ ఆత్మకు సహాయపడదు.
మొత్తానికి సాతానుకు ఈ సంగతి తెలుసు గనుక అతడు నీ మనసుపై దాడి చేసి నీ మీదికి అంటే నీ మనసు రణరంగం మీదకు యుద్ధానికొస్తాడు. ప్రతివిధమైన తప్పు పనితోను ప్రతివిధమైన తప్పు ఆలోచనతోను నీ మనస్సును భారభరితం చేసి అది స్వేచ్ఛగా లేకుండ నీ మానవ ఆత్మలో పనిచేయునట్లు పరిశుద్ధాత్మకు అందుబాటులో ఉండకుండజేయును.
మనస్సును ప్రశాంతముగా ఉంచుకోవాలి. ప్రవక్తయైన యెషయా మనకు చెప్పుచున్నట్లు మన మనస్సు సరియైన వాటిపై కేంద్రీకరించునప్పుడు అది విశ్రాంతిలో నుండును.
అయినప్పటికీ మనస్సు జాగరూకతతో నండవలెను, అది ఎన్నడును ఊహించని రీతిలో దానిపై భారము మోపబడిన యెడల ఇది అసాధ్యమవుతుంది.
దీనిని గూర్చి ఆలోచించు: ఎంతసేపు నీ మనస్సు మాములుగా ఉంటుంది?

No comments:
Post a Comment