ఆత్మ మరియు మనసు
"కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును". 1 కొరింథీ 14:15
ఆత్మకు మనస్సు సహాయపడటం అనెడు సిద్ధాంతమును సరిగ్గా అర్ధం చేసుకోవాలనుంటే ప్రార్థనను గూర్చి బహుశ ఆలోచించవలెను. ఈ వచనంలో అపోస్తులుడైన పౌలు తన ఆత్మతోను, మనస్సుతోను ప్రార్థనచేవాడని చెప్పాడు.
పౌలు దేనిని గూర్చి చెప్పుచున్నాడో నేను అర్ధం చేసుకోగలను ఎందుకంటే నేనుకూడా అదే చేస్తున్నాను. (ఒక తెలియని భాషలో) నేను ఆత్మతో తరచుగా ప్రార్థిస్తాను; అట్లు నేను ప్రార్థించిన కొంతసేపటికి తరచుగా నా మనసుకు తట్టగానే (నాకు తెలిసిన భాష) ఇంగ్లీషులో ప్రార్థిస్తాను. మనసు ఆత్మకు ఈవిధముగా సహాయపడుతుందని నేను అర్థంచేసుకుంటున్నాను. నేను అర్థం చేసుకొనగల రీతిలో అవి కలిసి దేవుని జ్ఞాన వివేకములను పొందుటకు పనిచేస్తాయి.
ఇది తిరోగమనంలో కూడ పని చేస్తుంది. నేను ప్రార్థించాలనుకున్నప్పుడు ప్రార్థన కొరకు దేవునికి నేను అందుబాటులో ఉండేలా చూసుకుంటాను. నా ఆత్మలో ప్రత్యేకమైన కలకలము లేకపోతే నేను నా మనస్సుతో నా ప్రార్థన మొదలుపెడతాను. నాకు తెలిసిన విషయాలను లేక పరిస్థితులను గూర్చి ప్రార్థిస్తాను. కొన్నిసార్లు ఇవి నిజంగా వ్యర్థమనిపిస్తాయి. నా ఆత్మనుండి ఏవిధమైన సహాయం రాదు. నేను పోరాడుతున్నట్లుగా నాకనిపిస్తుంది గనుక నాకు తెలిసిన దానిని గూర్చి చేయుటకే మళ్ళీ వెళ్తుంటాను.
నాలోవున్న పరిశుద్దాత్మ కొన్ని విషయాలమీద నాతో ఏకీభవించేవరకు నేను ఇదే పద్దతిని కొనసాగుతాను. ఆయన దానిని చేయునప్పుడు నన్ను ఏమి చేయమని కోరుచున్నాడో నాకు తెలిసిపోతుంది, అయితే అది నేను ప్రార్థించుటకు ప్రయత్నించిన అంశముకాదు. ఈ రకంగా నా మనస్సు నా ఆత్మ దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఒకదానికొకటి సహకరించుకొని కలిసి పని చేస్తాయి. ఆమెన్, హల్లెలూయా.....

No comments:
Post a Comment