చంచలమైన మనస్సు (Part-2)
"నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము; బుద్ధిహీనులు అర్పించు నట్లుగా బలి అర్పించుటకంటె సమీపించి ఆలకించుట శ్రేష్ఠము; వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు". ప్రసంగి 5:1
"నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము"అంటే నీ ప్రయాణాన్ని కోల్పోవద్దు లేక మార్గం తప్ప వద్దు అని అంటే ఒక వ్యక్తి తానేం చేస్తున్నాడో దానిపై తన మనస్సు పెట్టాలి అని ఈ మాటలకూ అర్థం.
నాకు ఛానలమైన మనస్సుంది, దాన్ని క్రమ శిక్షణలోనికి తేవాలి. అదంత సులభమైన విషయం కాదు. చేయాలనీ తీవ్రంగా ప్రయత్నిస్తూ వుండగా, ఈ పనికే విధంగానూ సంబంధం లేని వాటిని నా మనస్సు ఆలోచిస్తోందని గ్రహించాను. అంటే నేను నా మనస్సు చేస్తున్న పని మీద పూర్తిగా కేంద్రీకరించలేక పోయానన్నమాట, అయితే ఈ పని పూర్తిగాక నా మనస్సు దాని ఇష్టమొచ్చినట్లు ఆలోచించ నివ్వకుండా ఉండడం ఎంత ముఖ్యమో గ్రహించాను.
మీరు నాలా వుంటే, ఒక ఆరాధన కార్యక్రమంలో కూర్చొని బోధకుడు చెబుతున్నాదాని వింటూ, నిజంగా దానికి ఆనందిస్తూ, ఆయన చెప్పిన దానిలోని మేలును పొందుతూ వుండగా, హఠాత్తుగా మీ మనస్సు దేన్నో ఆలోచించడం మొదలు పెడుతుంది. కొంచెం సేపటికి నీవా స్థితిలో నుండి "మేల్కొని" అక్కడ జరుగుతున్న దేమిటో ఒక్కటీ జ్ఞాపకం వుండదు. మీ శరీరం మందిరంలోనే వున్నప్పటికీ, మీ మనస్సు ఎక్కడో బజారులో లేక వంట యింట్లో వంటపనిని గురించి ఆలోచిస్తూవుంటుంది.
ఆత్మయుద్ధంలో మనస్సే యుద్ధరంగం అని గుర్తుంచుకోండి. శత్రువు దాడిచేసేది అక్కడే. ఒక వ్యక్తి మందిరంలో వున్నా, అక్కడ చెబుతున్నదానిపై ఆ వ్యక్తి, తన మనస్సును లగ్నం చేయకపోతే, అతడక్కడుండి పొందినదేమి లేదని అతనికి తెలుసు. ఒక వ్యక్తి తాను చేస్తున్నదాని పై మనస్సును లగ్నం చేయక మరోదానిపై మనస్సు నుంచితే అతడు తలపెట్టిన పనిని చేయలేడని సాతానుకు తెలుసు.
ప్రియ మిత్రులారా ఈ భాగం ఇంకా పూర్తికాలేదు రేపు ఉదయం సంచికలో ముగిస్తాను.

No comments:
Post a Comment