చంచలమైన మనస్సు (Part-3)
ప్రియా స్నేహితులారా నిన్న సాయంత్రం ముగింపు పాఠ్యసారాంశం నుండి ఈ ఉదయం ప్రారంభం.
ఈ చంచలత్వాన్ సంభాషించేటప్పుడు కూడా వస్తుంది. నా భర్త దేవ్ నాతో మాట్లాడుతున్నప్పుడు, నేను కొంచెం సేపు విని, హఠాత్తుగా అతడు చెప్పిన దొకటి వినలేదని గ్రహిస్తూ వుంటాను. అలా ఎందుకని? అంటే అప్పుడు నా మనస్సును మరోదాన్ని మీద మరల్చెన్నమాట. నా శరీరం అక్కడే వుండి ఆ చెప్పేది వింటున్నట్టుగానే వుంది, అయినా నా మనసులో ఆ చెప్పింది నేనేమి వినలేదు.
చాలా సంవత్సరాలు యిలాగే జరిగిన తర్వాత, దేవ్ ఏమి చెబుతున్నాడో అది నాకు తెలుసు, వింటున్నాను అని నటించిన తర్వాత, "ఏమిటి, మళ్ళీ ఒకసారి చెప్పండి యిప్పుడు చెప్పింది నా మనస్సు ఎక్కడో వుంది. మీరు చెప్పింది నేను వినలేదు". అని యిప్పుడు చెప్పడం నేర్చుకున్నాను.
ఇలా ఆ సమస్యను పరిష్కరిస్తాననుకొంటున్నాను విషయాలను ఎదుర్కున్నడం వల్లనే వాటి విజయాన్ని పొందగలం.
సాతాను నాలో చంచలత్వాన్ని కలిగించి కష్టాన్ని రేపితే నేను చెప్పేది అలా కాదు. వినాలి అని నిర్ణయించుకున్నాను.
శత్రువును ఎదిరించడంలో ఒక మార్గం ఏమిటంటే అనేక సంఘాల వారు విడుదల చేసిన క్యాసెట్టు టేపులను వినడమే. మందిరంలో ఏం చెప్పారో మనస్సు పెట్టి వినలేక పోయినప్పుడు ఆ రోజు చెప్పిన సందేశపు టేపును కొని ఆసందేశాన్ని మీ మనస్సుకు పట్టేట్టు పదే పదే వినండి.
మీరు తన మాట వినడం లేదనుకొన్నప్పుడు అపవాది మిమ్ములను విడిచి పెట్టి వెళ్తాడు. నేను మానసిక లోపంగల వాడనని నాలో ఎదో లోపం వుందని మీరాలోచించాలని సాతాను అభిలాష అని గుర్తుంచుకోండి. అయితే మీరు మీ మనస్సును క్రమంలో పెట్టుకోవడమే సరైన పద్దతి. దాన్ని ఇష్టంవచ్చినట్లు ఆలోచించనివ్వకండి. ఇప్పుడే "నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి" నీవు చేస్తున్న దానిపై నీ మనస్సును లగ్నం చేయాలి. దీన్ని కొంచెం సేపు అభ్యాసం చేయాలి. పాత అలవాట్లను విడిచి కొత్త వాటిని అలవర్చుకోవడానికి ఎప్పుడూ కొంత సమయం పడుతుంది, అయినా చివరికి అదే మేలు.
ప్రియా స్నేహితులారా ఈ పాఠ్యభాగం ఇంతటితో ముగిసింది. ఆమెన్ హల్లెలూయా....

No comments:
Post a Comment