ఆశ్చర్యపోయే మనస్సు
"ఎవడైనను ఈ కొండను చూచినీవు ఎత్తబడి సముద్ర ములో పడవేయబడు మని చెప్పి, తన మనస్సులో సందే హింపక తాను చెప్పినది జరుగునని నమి్మనయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను". మార్కు 11:23,24
దేన్నైనా ఒకదాన్ని చూసినప్పుడు నాలో నాకే "ఆశ్చర్యం" అని అనిపిస్తూవుంటుంది. ఉదాహరణకు: "రేపు వాతావరణం ఎలా ఉంటుందో అని ఆశ్చర్యపోతూవుంటాను". "పార్టీకి ఎం తొడుక్కోవాలని ఆశ్చర్యపోతూ వుంటాను." "మా అబ్బాయి డానికి ఏ గ్రేడు వస్తుందో అని విస్మయం కలుగుతూ వుంటుంది.
"ఆశ్చర్యం" లేక "విస్మయం" అన్న పదానికి డిక్షనరీ "కలవరం, లేక సందేహం కలిగే భావం" అన్నది నామ వాచకమైతే - క్రియా పదం "ఆశ్చర్యం లేక సందేహంతో నిండి వుండుట" అని అర్దాలు చెబుతోంది.
ప్రతిదివూహించుకొని ఎప్పుడు ఆశ్చర్యపోయేదాని కంటే ఏదో అనుకూలమైన దాన్ని చేసినప్పుడు నేను బాగున్నట్టు గ్రహించాను. మా డానీకి ఏ గ్రేడు వస్తుందో అని విస్మయంచెందే దానికంటే అతడు మంచి గ్రేడు తెచ్చుకొంటాడు అని నమ్మాలి. పార్టీకి ఏ దుస్తులు వేసుకోవాలను కొనేదానికి బదులు ఏం వేసుకోవాలో నిర్ణయించుకోవడం మంచిది. వాతావరణాన్ని గురించి, నా మీటింగుకు ఎంత మంది వస్తారు అని అనుకొనే కంటే ఆ అంశాన్ని దేవునికి అప్పగించి ఏం జరుగుతుంది అన్నదాన్ని ఆలోచించక ఆయనే అన్నీ మేలులు చేస్తదనుకోవడం మంచిది.
ఆశ్చర్యం ఒక వ్యక్తిని సందిగ్ధంలో వుంచుతుంది. సందిగ్దత కలవరపెడుతుంది. ఆశ్చర్యపోవడం, నిర్ణయించుకోలేని సందిగ్దత, కలవరం అనేవి ఒక వ్యక్తి విశ్వాసంతో ప్రార్ధించి దేవుని నుండి తనడిగినవి పొందకుండా చేస్తాయి.
"మీరు దేనికొరకైతే ప్రార్ధిస్తారోవాటిని పొందినప్పుడు ఆశ్చర్యాన్ని పొందండి" అని చెప్పలేదు యేసు. దానికి బదులు - మీరు దేని కొరకు ప్రార్ధిస్తారో వాటిని పొందామని నమ్మండి అప్పుడవి మీరు పొందుతారు" అని అయన చెప్పాడు. క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం సందేహించ కూడదు. నమ్మకం కలిగి వుండాలి.

No comments:
Post a Comment