వైద్యుడా నిన్ను నీవే బాగు చేసుకో
"నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల? నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచినీకంటిలో నున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్ప నేల? వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కన బడును". మత్తయి 7:3-5
ఇతరుల తప్పులకు తీర్పు తీర్చుటకు సదా దుష్టుడు మన విషయంలో నిమగ్నమైయుండుటకు కొడుతుంటాడు. అందువలన మన తప్పిదాలను గమనించకుండునట్లు వాటి విషయం తలంపులేకుండ ఉంటాము.
దేవుడు తప్ప మనము ఎవరిని మార్చలేము మనలను మనము కూడా మార్చుకోలేము అయితే పరిశుద్దాత్మ దేవుడు మన జీవితాలు మార్చునట్లు సహకరించగలము. ఈ సహకారము దేవుడు మన వాస్తవదృష్టికి అనుగుణంగా ప్రవర్తించుట మన విడుదలకు మొదటి మెట్టు.

No comments:
Post a Comment