Tuesday, June 9, 2020

Don't Worry

చింతపడకండి లేక దిగులుపడకండి 


   "దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి". ఫిలిప్పీ 4:6

     "దిగులు అనే దాడి" జరిగినప్పుడు ఉపశమనం పొందడానికి ఇదొక మంచి లేఖన భాగం. 

   నోటిద్వారా దేవుని వాక్యాన్ని మాట్లాడ్డం మంచిదని, ఆలా చేయాలనీ నేను ప్రోత్సహిస్తాను. మన శత్రువుపై ఉపయోగించడానికి అది రెండంచుల పదునుగల ఖడ్గం (హెబ్రీ 4:12; ఎఫెసీ 6:17). దాడి జరిగేప్పుడు వరలోవున్న కత్తివలన ఏ ఉపయోగం కలుగదు. 

  దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చాడు, దాన్ని ఉపయోగించాలి? ఇలాటి వాక్య భాగాలు నేర్చుకోండి. శత్రువు దాడి చేసినప్పుడు యేసు వాక్యమనే ఆయుధాన్ని ఉపయోగించినట్టే మీరూ దాన్ని ఉపయోగించి అతని దాడిపై ఎదురుదాడి చేయండి. ఆమెన్ 

No comments:

Post a Comment