చింతపడకు -- దేవుని నమ్ము
"ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా". హెబ్రి 13:5
దేవుడు వచ్చి మీ అవసరాలు తీరుస్తాడా అన్న మీమాంస వచ్చినప్పుడు మిమ్ములను మీరు ప్రోత్సహించుకోడానికి ఈ లేఖన భాగం చాల మంచిది.
మనం మన మనస్సును ధనం మీద పెట్టి, మనలను గురించి మన మోలాటి జాగ్రత్త తీసుకోబోతున్నాం, ఎందుకంటే ఈ విషయాలను ఆయన జాగ్రత్త తీసుకొంటాడుగనుక మనం వాటిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఈ భాగం హెచ్చరిస్తుంది. ఆయన ఎన్నడూ మనలను విడువను, ఎడబాయను అని వాగ్దానం చేశాడు.
మీవంతు మీరు చేయండి. దేవుని వంతు చేయడానికి ప్రయత్నించవద్దు - భరించలేనంత భారం అది. మీరు జాగ్రత్తగా గాని లేకపోతె దాని బరువు క్రింద మీరు తునాతునకలైపోతారు.
దిగులుపడకండి. "యెహోవాయందు నమ్మిక యుంచి మేలుచేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము" కీర్తన 37:3

No comments:
Post a Comment