Thursday, June 11, 2020

Put your Worries on God

మీ చింత యావత్తు దేవుని మీద వేయండి 

   "దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి. ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి". 1 పేతురు 5:6,7

   మన శత్రువు మనకు సమస్య కలిగించాలని ప్రయత్నించినప్పుడు దాన్ని దేవునిమీద వేసే ఆధిక్యత మనకు ఉంది. "మీదవేయుట" అంటే త్రోసివేయడం అని అర్థం. మీకు నాకు ఉన్న అవకాశం, ఆధిక్యతలేమిటంటే మన సమస్యలను ఆయన మీదకు తోసివేయగలగడం. మనం ఆయనమీదకు తోసివేసినప్పుడు ఆయన తప్పకుండా వాటిని పట్టుకుంటాడు. వాటిని ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. 

    ఈ లేఖన భాగం ద్వారా మనం విధేయులం కావాలని చింతపడకూడదని తెలుసుకొంటున్నాం. చింతపడే వ్యక్తి తన సమస్యను ఎలాగో పరిష్కరించుకోగలనని ఆలోచిస్తూ వుంటాడు. ఒక సమస్యకి పరిష్కారాన్ని అన్వేషిస్తూ దాని చుట్టూ మనస్సు తిరగడాన్ని చింత అని అంటారు. ఒక గర్విష్టినిండా అతనే నిండివుంటాడు. వినయంగల వానిలో దేవుడు నిండివుంటాడు. గర్విష్టి దిగులుపడతాడు; విధేయతగలవాడు వేచి ఉంటాడు. 

 దేవుడు మాత్రమే మనలను విడిపించగలడు, ఆ విషయాన్నీ మనం తెలుసుకోవాలనుకొంటున్నాడాయన. కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా మన మొదటి స్పందన ఆయన మీద ఆధారపడ్డం, ఆయన విశ్రాంతిలో ప్రవేశించడం! ఆమెన్ 

No comments:

Post a Comment