Wednesday, June 17, 2020

Who are you to judge others?

ఇతరులకు తీర్పుతీర్చుటకు నీవెవడవు?

   "పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు". రోమా 14:4

      ఈరీతిగా తలంచుము, మీ పొరుగున కాపురమున్న ఆమె వచ్చి మీ ద్వారమునొద్ద నిలుచిండి మీ పిల్లలు ఫలానా బట్టలు వేసుకొని ఫలాని పాఠ్యాంశ పుస్తకాలను తీసుకోని వెళ్లాలని చెప్పినచో ఎలాగుండును. మీరేమని జవాబిస్తారు లేక మీ పొరుగుననున్న ఆమె వచ్చి మీ సేవకురాలు మీ యిల్లు శుభ్రము చేసే విధానము బాగుండలేదు (మీ సేవకురాలి పనితో మీరు సంతృప్తిచెంది యుండగా) అన్నప్పుడు మీరేమందురు?

  ఈ విషయాన్నే పరిశుద్ధగ్రంధము యిలా తెలుపుచున్నది మనందరమూ దేవునికి చెందినవారము, మనలో లోపములున్నను మనలను నిలబెట్టుచూ నీతిమంతులుగా ఎంచుచున్నాడు. మనము దేవునికి జవాబుదారులముగా ఒకరికి ఒకరము నిష్కారణంగా తీర్చకయుందుము. 

No comments:

Post a Comment